Showing posts with label నచ్చింది. Show all posts
Showing posts with label నచ్చింది. Show all posts

Friday, October 23, 2009

నమస్కరిస్తూ ...

జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నరనారీ హృదయనేత్రి

జయ జయ సస్యామల సు
శ్యామల చల చ్చేలాంచల
జయ వసంత కుసుమ లతా
చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ
లాక్షారుణ పదయుగళా

జయదిశాంత గత శకుంత
దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక
గళవిశాల పథ విహరణ
జయ మదీయ మధుర గేయ
చుంభిత సుందర చరణా

మొదటి టపా కృష్ణ శాస్త్రి గారికి నమస్సులతో...